గుజ్జర్ల నిరసనలు...250 రైళ్లకు అంతరాయం రిజర్వేషన్ల కోసం రాజస్థాన్ సవాయ్ మాదోపూర్ జిల్లాలో రైలు పట్టాలపై గుజ్జర్లు చేపడుతోన్న ఆందోళనల ప్రభావం దేశవ్యాప్తంగా మొత్తం 250కి పైగా రైళ్లపై పడింది. ఉత్తర రైల్వే పరిధిలో 20 రైళ్లను రద్దు చేశారు. ఏడింటి దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 5 శాతం కోటా కోరుతూ గుజ్జర్లతో పాటు మరో నాలుగు సామాజిక వర్గాల వారు గత మూడు రోజుల నుంచి రైలు మార్గాలపై బైఠాయించారు.
ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఉత్తర రైల్వే పరిధిలో 73 రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు అధికారులు తెలిపారు