రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ వరకు 875.31 మిల్లీ మీటర్లకు గాను 737.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు భూగర్భజలశాఖ అధికారులు తెలిపారు. సాధారణ వర్షపాతంతో కంటే 16 శాతం తక్కువ కురిసిందని అధికారుల తెలిపారు. భూగర్భ జలాలు సరాసరి 14.14 మీటర్ల లోతులో ఉన్నాయని గతేడాదితో పోలిస్తే 1.37 మీటర్ల లోతుకు పడిపోయినట్లు అధికారిక లెక్కల్లో బహిర్గతమైంది. భూగర్భ జలాలు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 8 జిల్లాల్లో మాత్రమే పెరిగినట్లు, మిగిలిన 25 జిల్లాల్లోనూ పడిపోయినట్లు భూగర్భ జలశాఖ సంచాలకులు పండిట్ తెలిపారు.
ఇదీ చదవండి: 15 రోజులుగా తాగడానికి చుక్కనీరు లేదు..