లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ర్యాలీని నిర్వహించనుంది ఆమ్ఆద్మీ పార్టీ. ఫిబ్రవరి 13న జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరుకానున్నాయి. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవనున్నారు.
తానీషా హటావో....దేశ్ బచావో...
నియంత పాలనను తొలగించి దేశాన్ని రక్షించాలనే నినాదంపై ఈ ర్యాలీని నిర్వహిస్తోంది ఆమ్ ఆద్మీ. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మహాకూటమిని సమీకరించేందుకు ఈ ర్యాలీని ఉపయోగించుకోనుంది ఆప్.