తెలుగులో 'అర్జున్ రెడ్డి' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. తమిళంలో ఈ చిత్రాన్ని 'ఆదిత్య వర్మ'గా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కథానాయకుడి తండ్రి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్టు సమాచారం.
ఇంతకు ముందే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినా.. కొన్ని కారణాలతో రీషూట్ చేస్తున్నారు. హీరోను తప్ప చిత్రబృందం మొత్తాన్ని మార్చేశారు.
బాలీవుడ్ నటి బనితా సంధు హీరోయిన్గా నటిస్తుండగా, ప్రియా ఆనంద్ కీలక పాత్రలో కనిపించనుంది. గిరీశయ్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జూన్లో చిత్రం విడుదల కానుంది.