కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థత కారణంగా బహిరంగ సభలోనే సొమ్మసిల్లారు. షిరిడీలో భాజపా అభ్యర్థి సదాశివ్ లోఖండే గెలుపుకోసం ఏర్పాటు చేసిన ప్రచార సభలో గడ్కరీ పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే తూలిపడబోయారు. సమీపంలో ఉన్న పార్టీ నేతలు ఆయనను కిందపడకుండా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. కొంత సమయం తర్వాత తేరుకున్న గడ్కరీ నడుస్తూ వెళ్లి తన వాహనంలో అక్కడి నుంచి బయల్దేరారు.
ఇదీ చూడండి: శశి థరూర్‌కు న్యాయస్థానం సమన్లు