ETV Bharat / briefs

ఫ్రెంచ్ ఓపెన్​: ప్రి క్వార్టర్స్‌లో నాదల్‌, హలెప్‌ - sports news

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అగ్రశ్రేణి ప్లేయర్ల జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్తోన్న టాప్‌ సీడ్‌ హలెప్‌.. ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌, యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ థీమ్‌ నాలుగో రౌండ్‌ చేరారు.

French Open
నాదల్​
author img

By

Published : Oct 3, 2020, 8:41 AM IST

Updated : Oct 3, 2020, 9:14 AM IST

గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో తనను ఓడించిన అమెరికా టీనేజీ సంచలనం అనిసిమోవాపై.. హలెప్‌ (రొమేనియా) ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఆమె 6-0, 6-1 తేడాతో 25వ సీడ్‌ అనిసిమోవాను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌ చేరింది. ప్రత్యర్థిని అనామక క్రీడాకారిణిగా మార్చేస్తూ రెచ్చిపోయిన హలెప్‌.. కేవలం 54 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించింది. ఆమె మూడు ఏస్‌లు, 15 విన్నర్లు కొట్టింది.

ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-4, 7-5తో అలెగ్జాండ్రోవ (రష్యా)పై, నదియా (అర్జెంటీనా) 6-3, 6-2తో కరోలిన (స్లోవేకియా), గార్సియా (ఫ్రాన్స్‌) 1-6, 6-4, 7-5తో 16వ సీడ్‌ మెర్టీన్స్‌ (బెల్జియం)పై, స్వియాటెక్‌ (పోలాండ్‌) 6-3, 6-2తో బౌచర్డ్‌ (కెనడా)పై నెగ్గారు.

French Open
నాదల్​

రఫెల్‌ జోరు

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) దూసుకెళ్తున్నాడు. మూడో రౌండ్లో అతను 6-1, 6-4, 6-0తో స్టెఫానో (ఇటలీ)పై గెలిచాడు. తొలిసెట్‌లో కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయిన అతను రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ తన అనుభవాన్ని ఉపయోగించిన నాదల్‌ నెగ్గాడు. ఇక మూడో సెట్​లో పూర్తి ఆధిపత్యం కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. అతను 2 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టాడు.

French Open
హలెప్‌

మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-4, 6-3, 6-1తో 28వ సీడ్‌ రూడ్‌ (నార్వే)పై నెగ్గాడు. అతను ప్రిక్వార్టర్స్‌ చేరడం వరుసగా ఇది అయిదోసారి. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం థీమ్‌దే. మ్యాచ్‌లో ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన థీమ్‌.. 5 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టాడు.

16వ సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సుదీర్ఘంగా సాగిన పోరులో అతను 6-2, 3-6, 3-6, 6-4, 0-6తో గాస్టన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. సెబాస్టియన్‌ (యుఎస్‌ఏ), లొరెంజో (ఇటలీ) కూడా ముందంజ వేశారు.

Last Updated : Oct 3, 2020, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.