జీహెచ్ఎంసీ, జొమాటో సంయుక్తంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రత్యేక ఆహారోత్సవం ఏర్పాటు చేశాయి. రంజాన్ మాసం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో హాలీమ్తో పాటు బిర్యానీ, హైదరాబాద్ ప్రత్యేక చాట్బండర్ వంటి మంచి రుచికరమైన ఆహారం అందిస్తున్నట్లు జొమాటో ప్రతినిధి నిఖిల్ తెలిపారు. ఇందులో ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు. నగరవాసులు వివిధ రకాలైన ప్రత్యేక వంటకాలతో పాటు హాలీమ్ రుచులను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వంటకాలు చాలా బాగున్నాయని వారు చెబుతున్నారు.
ఇవీ చూడండి: నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ భేటీ