హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో గల ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమందించారు. వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడానికి కారణం షాట్సర్క్యూటేనని అధికారులు వెల్లడించారు. చుట్టూ జనావాసలు లేకపోవడం వల్ల ప్రాణహాని తప్పిందని... కానీ దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: నేడు జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నిక