ETV Bharat / briefs

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ - మొదటి స్థానంలో మల్కాజిగిరి

పార్లమెంటు ఎన్నికల ముందు సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్​కుమార్​ విడుదల చేశారు. లోక్​సభ నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితా విడుదల చేశారు.

ఓటర్ల తుది జాబితా విడుదల
author img

By

Published : Mar 26, 2019, 9:26 AM IST

Updated : Mar 26, 2019, 9:36 AM IST

ఓటర్ల తుది జాబితా విడుదల
రాష్ట్రంలో సవరించిన తాజా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్​సభ నియోజక వర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్​కుమార్​ సోమవారం విడుదల చేశారు.

భారీగా పెరిగిన ఓటర్లు

మొన్నటి శాసనసభ ఎన్నికల సమయంలో ప్రకటించిన జాబితాతో పోలిస్తే ఇప్పటికి కొత్తగా మూడు లక్షల 89వేల 676 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,49,19,751. మహిళా ఓటర్లు 1,47,76,024మంది, ఇతరులు 1,504 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 6,52,744 మంది, దివ్యాంగులు 5,13,762 మంది ఉన్నారు.

మొదటి స్థానంలో మల్కాజిగిరి

లోకసభ నియోజక వర్గాల్లో అత్యధికంగా మల్కాజిగిరి నుంచి 31,49,710 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా మహబూబాబాద్​ నుంచి 14,23,351 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇదీ చదవండి:మొత్తం 795... నిజామాబాద్​లో 245

Last Updated : Mar 26, 2019, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.