ETV Bharat / briefs

రేపటి నుంచే ఎంబీబీఎస్​, బీడీఎస్ ధ్రువపత్రాల పరిశీలన - mbbs certificate verification

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఖరారు చేసింది. రేపటి నుంచి జులై ఐదో తేదీవరకు  ధ్రువపత్రాలు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

రేపటి నుంచే ఎంబీబీఎస్​, బీడీఎస్ ధ్రువపత్రాల పరిశీలన
author img

By

Published : Jun 28, 2019, 11:46 PM IST

Updated : Jun 29, 2019, 12:02 AM IST

కన్వీనర్ కోటాలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యూజీ సీట్ల భర్తీకి ఆన్​లైన్​లో దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగిసింది. రేపటి నుంచి జులై ఐదో తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్​లో నాలుగు సెంటర్లు, వరంగల్​లో ఒక సెంటర్ మొత్తం ఐదు సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. నాన్​లోకల్ అభ్యర్థులతో పాటు స్పెషల్ కేటగిరి అభ్యర్థులకు జేఎన్టీయూలో ఈనెల 29 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు... లోకల్ అభ్యర్థులకు హైదరాబాద్​లోని ఏవీ కాలేజ్, పీజీఆర్ ఆర్ సీడీఈ ఉస్మానియా క్యాంపస్, వరంగల్​లోని కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జులై 4వ తేదీ వరకు, నిజాం కాలేజీలో జులై 1 నుండి నాలుగో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ర్యాంకుల వారిగా నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ధ్రువపత్రాలు పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. పూర్తి సమాచారం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in , www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

రేపటి నుంచే ఎంబీబీఎస్​, బీడీఎస్ ధ్రువపత్రాల పరిశీలన

ఇదీ చూడండి: గోదావరి జలాల తరలింపుపై కమిటీ ఏర్పాటు

Last Updated : Jun 29, 2019, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.