ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని భరోసానిచ్చారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ రశీదులను అందించారు. రశీదులు తప్పకుండా భద్రపరుచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా రూ.2లక్షల బీమా వర్తిస్తుందన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా.. ఈ ప్రాంత ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించారని ఈటల పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హుస్సేన్ సాగర్లో జాతీయ సెయిలింగ్ పోటీలు షురూ