ETV Bharat / briefs

'ఉన్నోళ్లకు లేనోళ్లకు ఒకే రకమైన విద్యనందించాలి'

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్ఠ పరచాలని..విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ ఆచార్య శాంతాసిన్హా డిమాండ్ చేశారు. విద్యా సామర్థ్యాలు అందించే ప్రక్రియను పర్యవేక్షించడానికి స్వయం ప్రతిపత్తి గల కమిషన్​ను ఏర్పాటు చేయాలన్నారు.

విద్యా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధం కావాలి : శాంతాసిన్హా
author img

By

Published : Jun 25, 2019, 4:56 PM IST

సరస్వతి అనుగ్రహం లేకపోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో సీఎం కేసీఆర్​ జవాబివ్వాలని ఎన్సీపీసీఆర్ మాజీ ఛైర్ పర్సన్ ఆచార్య శాంతాసిన్హా ప్రశ్నించారు. విద్యా సామర్థ్యాల సాధన కోసం హైదరాబాద్​లో నిర్వహించిన తల్లుల సదస్సులో సరస్వతి తాండవం చేసేందుకు తల్లులు సిద్ధంగా ఉన్నారని..వారిని కేసీఆర్ ఎదుర్కొగలరా అని సవాల్ విసిరారు. అందరికీ సమాన విద్యను అందించే విధంగా ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు పరచాలని కోరారు.
డబ్బున్నోళ్లకు ఒక విద్య, పేదవారికి మరో విద్య అనే వ్యత్యాసాలు ఉండకూడదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకపోతే అనతి కాలంలోనే 10 కోట్ల మంది పిల్లలు నిరక్షరాస్యులుగా మిగిలిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుల కోసం కష్టపడే తల్లులు వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు పోరాటాలకు సమాయత్తం కావాలని సూచించారు.

విద్యా వ్యవస్థ పర్యవేక్షణకు స్వయం ప్రతిపత్తి గల కమిషన్​ను ఏర్పాటు చేయాలి : తల్లుల సంఘం

ఇవీ చూడండి : ఫోన్​ మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య

Hyd_Tg_36_25_Mothers Education Seminar_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) రాష్ట్రంలో సరస్వతి తాండవం లేకపోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని... జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్ పర్సన్ ఆచార్య శాంతాసిన్హా కోరారు . ప్రభుత్వ , ప్రేవేట్ బడులలో విద్య సామర్ధ్యాలు అందించాలని తల్లుల సంఘం హైద్రాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తల్లుల సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . సరస్వతి తాండవం ఆడేందుకు తల్లులు పోరాడేందుకు ముందున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. అందరికి సమాన విద్యను అందించే విధంగా ప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆమె కోరారు . సమాజంలో డబ్బున్న వారికి ఒక విద్య , పేదవారికి ఒక విద్య అందించే విధంగా వ్యత్యాసాలు చూపకూడదన్నారు . బడుగు , బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకపోతే కొన్ని సంవత్సరాలలోనే దేశంలో 10 కోట్ల మంది పిల్లలు విద్యావ్యవస్థ నుంచి జరుకోని నిరక్షరాస్యులుగా మిగిలిపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్య సామర్ధ్యాలు అందించే ప్రక్రియను పర్యవేక్షించడానికి స్వయం ప్రతిపత్తి గల కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు . పిల్లల చదువు కోసం ప్రతి రోజు కష్టపడుతున్న తల్లులు ... వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు పోరాటాలకు కూడా సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. బైట్ : ఆచార్య శాంతాసిన్హా ( జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.