సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి సమీపంలో విద్యుదాఘాతంతో ఓ లారీ డ్రైవర్ మరణించాడు. దుబ్బాక మండలం హమన్మీరాపూర్ గ్రామానికి చెందిన యాదాగౌడ్... ఓ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రావురూకుల నుంచి చిన్నగుండవెళ్లి వెళ్లే మార్గమధ్యంలో రహదారి పనుల కోసం ట్యాంకర్‌లోకి నీటిని నింపాడు. అనంతరం ట్యాంకర్‌ను వెనక్కి తిప్పే ప్రయత్నంలో వాహనం 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి టైర్లు అంటుకున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్‌కు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
యాదాగౌడ్ మృతికి అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపించారు. ఎస్సై కోటేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ప్రశాంతంగా 'సార్వత్రికం' తుది దశ పోలింగ్