సొంత గడ్డపై దిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు తలపడనుంది. గత రెండు మ్యాచుల్లో ఓడిన రైజర్స్ ఈ మ్యాచ్‌తో మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
దిల్లీ గెలుపు పరంపరను కొనసాగిస్తుందా..
వరుసగా రెండు విజయాలు సాధించి పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతోంది దిల్లీ క్యాపిటల్స్. శుక్రవారం కోల్‌కతాపై గెలిచిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ విజయ పరంపరను ఇలానే కొనసాగించాలని అనుకుంటోంది.
-
TRAIN 💥
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
CONQUER 💪🏻
CHILL 😎
Presenting #DCChronicles. Ep03. 🎥#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/Ykpin7KEdd
">TRAIN 💥
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2019
CONQUER 💪🏻
CHILL 😎
Presenting #DCChronicles. Ep03. 🎥#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/Ykpin7KEddTRAIN 💥
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2019
CONQUER 💪🏻
CHILL 😎
Presenting #DCChronicles. Ep03. 🎥#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/Ykpin7KEdd
గబ్బర్ మరోసారి మెరుస్తాడా..
గత మ్యాచ్‌లో 97 పరుగులతో ఆకట్టుకున్నారు దిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్. చాలా రోజుల తర్వాత అతడు ఫామ్‌లోకి రావడం దిల్లీకి కలిసొచ్చే అంశం. పంత్ చెలరేగి ఆడుతున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ పృథ్వీషా.. మిగతా బ్యాట్స్‌మెన్ తమ వంతు పాత్ర పోషిస్తే క్యాపిటల్స్‌కు తిరుగుండదు.
బౌలర్లు రబాడ, ఇషాంత్, మోరిస్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
రైజర్స్ గెలుపు బాట పట్టేనా..
-
#OrangeArmy are you ready for some thrilling action in our 100th IPL game? The boys have prepared well at training, it's time to #RiseWithUs against the Capitals. #SRHvDC #VIVOIPL 🧡 pic.twitter.com/Xa1vQxjLG9
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#OrangeArmy are you ready for some thrilling action in our 100th IPL game? The boys have prepared well at training, it's time to #RiseWithUs against the Capitals. #SRHvDC #VIVOIPL 🧡 pic.twitter.com/Xa1vQxjLG9
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2019#OrangeArmy are you ready for some thrilling action in our 100th IPL game? The boys have prepared well at training, it's time to #RiseWithUs against the Capitals. #SRHvDC #VIVOIPL 🧡 pic.twitter.com/Xa1vQxjLG9
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2019
సన్‌రైజర్స్ హైదరాబాద్ గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పరాజయాల బాట నుంచి త్వరగా బయటపడి విజయాన్ని అందుకోవాలని గట్టిగానే కృషి చేస్తోంది సన్‌రైజర్స్. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్‌లో రైజర్స్ గెలిచింది.
మ్యాచ్ పట్టేయాలంటే ఓపెనర్లు నిలవాలి
హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో సీజన్ మొదట్లో ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నారు. మిడిలార్డర్లో విజయ్ శంకర్, మనీష్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్ ఆకట్టుకోలేకపోతున్నారు.
బౌలర్లు కట్టడి చేస్తారా..
బౌలర్లలో పేస్ దళం భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్, నబీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వీరు చెలరేగితే రైజర్స్ గెలుపు ఖాయమే.
జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మనీష్ పాండే, డేవిడ్ వార్నర్, దీపక్ హుడా, నబీ, యూసుఫ్ పఠాన్, విజయ్ శంకర్, బెయిర్ స్టో, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ
దిల్లీ క్యాపిటల్స్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, ఇషాంత్, రబాడ, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, కీమో పాల్, ఇంగ్రామ్, రాహుల్ తెవాటియా