హైదరాబాద్ నగర శివారు నార్సింగ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ ప్రాంతంలో సినీ దర్శకుడు వీవీ వినాయక్ ఇంటిని సైతం కూల్చివేశారు. వీవీ వినాయక్‌కు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రెండంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులుండగా.. వినాయక్ ఆరంతస్తులు నిర్మిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన మున్సిపల్ అధికారులు వాటిని కూడా కూల్చివేయనున్నారు.
ఇవీ చూడండి: ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా