ETV Bharat / briefs

డెబిట్‌ కార్డుల క్లోనింగ్‌ ముఠా గుట్టురట్టు - sajjanar

బ్యాంకు డెబిట్‌ కార్డులు క్లోనింగ్‌ చేస్తూ డబ్బులు కాజేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన 10 మంది అంతర్రాష్ట్ర నేరగాళ్లను  పోలీసులు అరెస్ట్​ చేశారు. 1000 కార్డుల ద్వారా రూ.3 కోట్లు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచించారు.

నిందితులు
author img

By

Published : Apr 24, 2019, 8:33 PM IST

Updated : Apr 25, 2019, 1:18 AM IST

3.1 కోట్ల విత్​ డ్రా

బ్యాంకు డెబిట్ కార్డులు క్లోనింగ్ చేస్తూ బ్యాంకులను మోసం చేస్తున్న 10మంది అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం జామ్‌తారా జిల్లాకు చెందిన దుర్యోదన్ మండల్, సంజయ్, వీరేంద్ర, ధనుంజయ్​తోపాటు మరో ఆరుగురు ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున సైబర్ క్రైం మోసాలకు పాల్పడుతున్నారు. 12 రాష్ట్రాల్లో దాదాపు 3,500 కార్డుల ద్వారా రూ.3.1 కోట్లు విత్​ డ్రా చేసినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నిందితుల వద్ద ఏటీఎం కార్డు, స్వైపింగ్‌ యంత్రం, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

నేరుగా బ్యాంకుకే

ఐసీఐసీఐ బ్యాంకు పిన్ నెంబర్లు ఇతర వివరాలు కావాలంటూ కస్టమర్ కేర్​కు ఫోన్లు రావడం వల్ల అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఈ ముఠా గుట్టురట్టయింది. జామ్‌తారా జిల్లాలోని యువత సైబర్‌ క్రైమ్ నేరాలనే వృత్తిగా ఎంచుకుని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నేరగాళ్లంతా 7 వ తరగతి మాత్రమే చదివినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పోలీసు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై పీడీచట్టం ప్రయోగించనున్నట్లు సజ్జనార్ తెలిపారు.

జాగ్రత్త

నిందితులు బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్నారని, 3 లక్షల మందికి ఫోన్లు చేసి యూపీఐ ఓటీపీ సమాచారం తెలుకుని డబ్బు డ్రా చేశారన్నారు. రిజిస్టర్‌ నంబర్‌ కాక ఇతర ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేయాలని సీపీ సూచించారు. ప్రజలు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు. ఈ కామర్స్‌లో సమాచారాన్ని బయటి వ్యక్తులు దొంగిలిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

డెబిట్‌ కార్డుల క్లోనింగ్‌ ముఠా గుట్టురట్టు

ఇవీ చూడండి: ఉచితంగా రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​

Last Updated : Apr 25, 2019, 1:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.