ETV Bharat / briefs

కాసులు కురిపించే కడక్​నాథ్​ కోళ్లు - amith

ఆ కోడి అన్నింటిలో ప్రత్యేకం. రంగు, రుచి, ధరలో దానికదే సాటి. ఒక్కసారి దాని మాంసం రుచి చూస్తే ఇక వదలరు. మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది అదే కడక్​నాథ్ కోడి. ఈమధ్య కాలంలో ఈ రకం కోళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

ఖరీదైన కడక్​నాథ్ కోడి
author img

By

Published : Mar 28, 2019, 6:27 PM IST

ఖరీదైన కడక్​నాథ్ కోళ్లు
కోళ్లలో రకరకాల జాతులు ఉంటాయి. వాటిలో కొన్నింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రంగు, రుచి, ధరకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి కోవకు చెందినదే కడక్​నాథ్​ కోడి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లభించే ఈ అరుదైన నల్ల రకం కోళ్లను కుమురం భీం జిల్లా నజృల్​నగర్​కు చెందిన అమిత్​దాస్ అనే యువకుడు పెంచుతున్నాడు.

ఈ రకం కోళ్లు సాధారణ కోళ్ల కంటే భిన్నంగా ఉండటం... ఆరోగ్య పరంగా మంచి పోషకాలు లభిస్తుండటం వల్ల వీటికి ఎక్కువ డిమాండ్ ఉండటాన్ని గ్రహించాడు. యూట్యూబ్​లో వీటి గురించి తెలుసుకొని... పెంపకం చేపట్టి ఉపాధిగా మల్చుకోవాలని భావించాడు అమిత్​దాస్.

కిలో రూ.800 నుంచి 1000..

హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని గౌట్ రీసెర్చ్ సెంటర్ నుంచి 100 కోడి పిల్లలను కొనుగోలు చేశాడు. పెరట్లో వాటికోసం ఒక చిన్న షెడ్డు ఏర్పాటు చేశాడు. భార్యభర్తలిద్దరూ కలిసి వాటి పెంపకం చేపట్టి.. ఆహారంగా మొక్కజొన్న, నూకలు, తవుడు, జొన్నలు లాంటి పదార్థాలు అందజేశారు. 5 నెలల్లో ఈ కోడి 2 నుంచి రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతుందని అమిత్​ చెబుతున్నాడు. మార్కెట్​లో కిలో కడక్​నాథ్ కోడి రూ.800 నుంచి 1000 వరకు పలుకుతుందన్నాడు. ఈ కోడి గుడ్డుకు రూ.100 వరకు ధర ఉంటుందని తెలిపాడు.

పోషకవిలువలు అధికం..

ఈ రకం నల్ల కోళ్లలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉండటం... కావలసినన్ని పోషకవిలువలు ఉండటం వల్ల వీటికి డిమాండ్​ ఉందన్నాడు అమిత్​. కడక్​నాథ్ కోడి మాంసం తినడం వల్ల గుండెజబ్బులు, ఆస్తమా, నరాల బలహీనత, వంటి వ్యాధులు దూరం అవుతాయని పరిశోధనలో తేలిందని పేర్కొన్నాడు. సాధారణ కోళ్ల కంటే ఈ కడక్​ కోడి మాంసం రుచికరంగానూ... ఆరోగ్యానికి మేలు చేస్తుండటం వల్ల మాంసాహార ప్రియులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.