ETV Bharat / briefs

హైదరాబాద్​ కలెక్టరేట్​ ఎదుట కాంగ్రెస్​ ధర్నా

ఇంటర్​ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్ నేతలు​ హైదరాబాద్​ కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం,ఇంటర్​ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు.

కాంగ్రెస్ నేతల నిరసన...
author img

By

Published : Apr 25, 2019, 6:40 PM IST

ఇంటర్​ విద్యార్థుల చావుకు కారణమైన విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం వల్ల చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం 25లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఎక్స్‌గ్రేషియాపై ప్రభుత్వం స్పందించకపోతే రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెుదటగా కొంతమంది విద్యార్థి నాయకులను అరెస్టు చేసి గాంధీనగర్​ పోలీసు స్టేషన్​కు తరలించారు. తర్వాత కిసాన్​ సెల్​ నేత కోదండరెడ్డి, గ్రేటర్​ అధ్యక్షుడు అంజన్​ కుమార్​ యాదవ్, యువజన విభాగం నేత అనిల్​ కుమార్​ యాదవ్, ఎన్​ఎస్​యూఐ ప్రెసిడెంట్​ వెంకట్​ను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు తరలించారు.

కాంగ్రెస్ నేతల నిరసన...

ఇవీ చూడండి: విజయవంతంగా రెండో మోటార్​ ట్రయల్ ​రన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.