ETV Bharat / briefs

పోలింగ్​ ముగిసింది.. ఫలితాలే తెలియాల్సింది.. - BJP

తెలంగాణలో సార్వత్రిక సమరాంగణం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎప్పటిలాగానే ఈసారి ఈవీఎంల మొరాయింపు సమస్య తప్పలేదు. వేసవి తీవ్రత లెక్కచేయకుండా గ్రామాల్లో ఉత్సాహంగా ఓటేసేందుకు తరలివచ్చారు. పట్టణాల్లో మాత్రం ఆ ఉత్సాహం కనిపించలేదు. మొత్తంమీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫలితాలు మే 23న రానున్నాయి.

పోలింగ్​ ముగిసింది.. ఫలితాలే తెలియాల్సింది..
author img

By

Published : Apr 11, 2019, 11:40 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్​ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్​ నియోజకవర్గం మినహా మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్​ ముగిసింది. అభ్యర్థులు ఎక్కువ ఉండటం వల్ల ఇందూరులో 6 గంటల వరకు ఓటింగ్​ కొనసాగింది. పలు ప్రాంతాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించినా అధికారులు త్వరగా స్పందించడం వల్ల పోలింగ్​కు అంతరాయం కలగలేదు.

పోలింగ్​ను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించింది. 4వేల 169 కేంద్రాల ద్వారా నిరంతరం ఓటింగ్ సరళిని గమనించారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఓటు నమోదుకు ఈసీ 11 గుర్తింపు కార్డులను అనుమతించింది. పోలింగ్​ కేంద్రాల్లో చరవాణులను అనుమతించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా చింతమడకలో, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓటేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సూర్యాపేట జిల్లా కోదాడలో, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హైదరాబాద్ ఉదయ్ నగర్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దివ్యాంగులు, వృద్ధుల ఓటింగ్​ శాతం పెంచేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాట్లు చేశారు.

వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపినా.. పలుచోట్ల ఇబ్బందులు తప్పలేదు. సికింద్రాబాద్​ పరిధిలో ఓ వృద్ధురాలు కాళ్లు చచ్చుపడిపోయి ఓటు వేయక ఇబ్బంది పడగా.. తుకారాం గేట్​ ఎస్సై రామ్​లాల్​ సాయం చేసి ఆమెతో ఓటు వేయించారు.

ఉత్కంఠకు తెర

దేశవ్యాప్తంగా చర్యనీయాంశమైన నిజామాబాద్​ పోలింగ్​ ఉత్కంఠకు తెరపడింది. మొదటిసారిగా ఎం-3 ఓటింగ్​ యంత్రాలతో విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి. 185మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో 12 ఈవీఎం యూనిట్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు. పలు చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించినా... అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేశారు.

సెల్​ఫోన్​ టార్చ్​ వెలుగులో పోలింగ్

ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నా.. అక్కడక్కడా కొన్ని సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్​ నాంపల్లిలోని 110వ పోలింగ్​కేంద్రంలో విద్యుత్​లేక.. సెల్​ఫోన్​ టార్చ్​ వెలుగులో ఓటింగ్​ నిర్వహించారు. చీకట్లో గుర్తులు సరిగ్గా కన్పించక... ఎవరికి ఓటు వేశామో అని ప్రజలు ఆందోళన చెందారు.

పోలింగ్​ కేంద్రంలో తేనెటీగల దాడి

మహబూబాబాద్​ జిల్లా చిన్నఇలాపురంలోని 15వ బూత్​లో తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు విజృంభించడంతో ఓటర్లు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

విషాదంలో తీలేరు.. ఖాళీగా పోలింగ్​ కేంద్రాలు

నారాయణపేట జిల్లా తీలేరు గ్రామంలో బుధవారం మట్టిదిబ్బలు విరిగిపడి ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఓటింగ్​లో పాల్గొనడానికి తీలేరు గ్రామస్థులు ఆసక్తి చూపలేదు. ఎన్నికల అధికారులు నచ్చజెప్పగా.. కొంత మంది ఓటు వేశారు. మరోరోజు పోలింగ్​ నిర్వహిస్తే అందరం పోలింగ్​లో పాల్గొంటామని గ్రామస్థులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాగ్వాదాలు చోటు చేసుకున్నా.. పోలీసులు త్వరగా స్పందించి నియంత్రించగా.. గొడవలు సద్దుమణిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో పార్లమెంట్​ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ముగిసిన సమరం

ఇవీ చూడండి: 'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.