ETV Bharat / briefs

అవినీతి, అలసత్వం రూపుమాపేలా చట్టాలు: కేసీఆర్​ - పురపాలక చట్టం

ప్రజల భవిష్యత్​ అవసరాలను గుర్తించి పటిష్ఠమైన విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులను ఆదేశించారు.  ప్రగతి భవన్​లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో నూతన రెవెన్యూ, పురపాలక చట్టాలపై చర్చించారు. కలెక్టర్​ పేరు మార్పుపై సూచనలు ఇవ్వాలన్నారు. ఐఏఎస్​ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీసెస్​ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

'అవినీతి, అలసత్వం రూపుమాపేలా చట్టాలు'
author img

By

Published : Apr 13, 2019, 12:00 AM IST

రాష్ట్రంలో త్వరలో నూతన రెవెన్యూ, పురపాలక చట్టాలు రూపుదాల్చనున్నాయి. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేలా కొత్త చట్టాలను రూపకల్పన చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్​ అదేశించారు. ప్రగతిభవన్​లో అధికారులు, మంత్రులతో సమావేశం నిర్వహించారు.

పట్టణాలు, నగరాల కోసం అర్బన్​ పాలసీని తీసుకురావాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. కలెక్టర్​ను అదే పేరుతో కొనసాగించాలా.. లేక పాలనాధికారులుగా పేరు మార్చాలో సూచించాలన్నారు. ఇండియన్​ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్​ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్​ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్ల నిర్వీర్యమైన పరిపాలనా విభాగాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల పరిషత్​ విధుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని సూచించారు. అవినీతి లేకుండా ప్రజల పనులు జరిగితేనే సంస్కరణల లక్ష్యం నేరవేరుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతిపై ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని.. లంచాలు లేని వ్యవస్థ కోసం కఠినంగా వ్యవహరించాలన్నారు.

అనుమతులు, ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అలసత్వం పనికిరాదన్న సీఎం... కారకులపై చర్యలు తీసుకావాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీ పాలన అందుబాటులో ఉండే విధానం రావాలన్నారు. జీహెంఎంసీ, హెచ్​ఎండీఏలతోపాటు ఇతర పట్టణాల, నగరాలను అభివృద్ధి చేసేందుకు నూతన పాలసీ తీసుకురావాలని సూచించారు.

'అవినీతి, అలసత్వం రూపుమాపేలా చట్టాలు'

ఇవీ చూడండి: ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందా..?

Intro:తలంబ్రాల

Body:విశిష్టత

Conclusion:భద్రాచలం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.