ETV Bharat / briefs

ఏఐసీసీలో మార్పులు... విధేయులకే పదవులు

లోక్​సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్​లోనూ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్​ నేతల్లో ఎవరిని ఏ పదవి వరిస్తుందోనన్న అంశం పార్టీలో చర్చినీయాంశంగా మారింది.

ఏఐసీసీలో మార్పులు... విధేయులకే పదవులు
author img

By

Published : May 28, 2019, 5:56 AM IST

ఏఐసీసీలో మార్పులు... విధేయులకే పదవులు

పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​కు దేశ వ్యాప్తంగా ఆశించిన స్థానాలు దక్కకపోవడం వల్ల ఆ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 25న దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీలో ఏఐసీసీ కమిటీ, ఆఫీసు బేరర్లు అంతా రాజీనామా చేయాలని తీర్మానం చేసింది.

ఏడుగురు రాజీనామా

ఆ తీర్మానం మేరకు రాష్ట్రానికి చెందిన ఏడుగురు నేతలు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏఐసీసీ కార్యదర్శులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మధుయాస్కీ, మాజీ మంత్రి చిన్నా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధులుగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌, ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడిగా కోదండ రెడ్డిలు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

ఎవరికి దక్కెనో?

రాష్ట్రంలో కేంద్ర మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి, రేణుకాచౌదరి, బలరాంనాయక్‌, సర్వే సత్యనారాయణ, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతురావు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, నంది ఎల్లయ్య, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, సురేశ్​ షెట్కార్‌, మాజీ మంత్రులు జానారెడ్డి, ప్రసాద్‌ కుమార్‌, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌ తదితరులు పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

విధేయులకే పట్టం

రాష్ట్రం నుంచి ఎంత మందికి ప్రాతినిధ్యం దక్కుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏడుగురికి అవకాశం ఉండగా అంతకంటే తక్కువ కాకుండా పదవులు వరిస్తాయని భావిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉండి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వారికే ఈ పదవులు దక్కుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇదీ చూడండి : ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమం

Intro:Body:

er

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.