ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎంపీ సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. బృందాలుగా ఏర్పడ్డ సిబ్బంది.. దేశవ్యాప్తంగా ఉన్న 12 ప్రాంతాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగించారు. బెంగళూరులో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీపై నమోదైన కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఆంధ్రా, సెంట్రల్, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ.. 360 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. తిరిగి తమకు రుణమొత్తం చెల్లించలేదంటూ.. రెండేళ్ల క్రితం బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుపై.. ఇప్పటికే సంస్థ ఎండీతో పాటు డైరెక్టర్లపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్.. సుజనా గ్రూప్ బినామీ సంస్థగా అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలోని సుజనా చౌదరి నివాసంతో పాటు.. జూబ్లీహిల్స్, పంజాగుట్టలోని కార్యాలయాల్లో సోదాలు చేశారు.
ఇవీ చూడండి: వైరల్: ఇడ్లీ తయారీకి టాయిలెట్ వాటర్