ETV Bharat / briefs

పార్లమెంటు సమావేశాల్లో రక్షణ ఖర్చులపై కాగ్​ నివేదిక

author img

By

Published : Aug 23, 2020, 5:03 AM IST

Updated : Aug 23, 2020, 7:10 AM IST

రక్షణ ఒప్పందాలపై కాగ్​ నివేదికను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. అయితే ఈ నివేదికలో రఫేల్​ అంశానికి సంబంధించి భాజపా, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

BIZ-FM-CAG-RAFALE
కాగ్​ నివేదిక

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రక్షణ ఖర్చులపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ తర్వాతే కాగ్​ నివేదించిన విషయాలు బహిర్గతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

"2019లో రక్షణ అంశాలపై కాగ్​ నివేదక నెం.20 ను బడ్జెట్​ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అనుకున్న దాని కన్నా ముందే సమావేశాలు ముగిశాయి. అందువల్ల ఈ నివేదికను వచ్చే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నాం."

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

రాజకీయ దుమారం..

అయితే ప్రస్తుత కాగ్​ నివేదికకు సంబంధించి ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కొన్ని వార్తా కథనాల ఆధారంగా చూపి కాగ్​ నివేదికలో రఫేల్​ ఒప్పందాన్ని చేర్చలేదని ఆరోపించారు. అసలు ప్రభుత్వానికి కాగ్​ ఇచ్చిన నివేదికలో రఫేల్ అంశమే లేదని మండిపడ్డారు. రఫేల్​ ఒప్పందంతో భారత ఖజానాను దొంగలించారని ఆరోపించారు.

రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​.

"తన తండ్రి పాపాలను కడిగేందుకు రాహుల్ రఫేల్​ అంశాన్ని వినియోగించటం పార్టీకే నష్టం చేకూర్చుతుందని ఆయన సహచరులే చెబుతున్నారు. వాళ్ల పతనం వాళ్లే కోరుకుంటే మేం ఏం చేస్తాం? రఫేల్​పై 2024 ఎన్నికల్లో పోరాడేందుకు రాహుల్​ను ఆహ్వానిస్తున్నా."

- పీయూష్ గోయల్​, కేంద్ర రైల్వే శాఖ మంత్రి

ఇదీ చూడండి: 'రఫేల్​ విషయంలో దేశ ఖజానా దోపిడీకి గురైంది'

Last Updated : Aug 23, 2020, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.