అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ తన ఎడమ చేతికి హోం క్వారంటైన్ స్టాంప్ వేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దానిపై వివరణ ఇచ్చాడు బిగ్ బచ్చన్. స్టాంపుతో తీసుకున్న ఫొటోను ఆయన మంగళవారం ట్విటర్‌లో షేర్ చేయగా.. వాటిపై విపరీతంగా పుకార్లు వెళ్లువెత్తాయి. ఈ స్టార్ హీరో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడని.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలు కథనాలు వెలువడ్డాయి. అయితే తన పోస్టును అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని తాజాగా క్లారిటీ ఇచ్చాడు అమితాబ్.
" చేతికి హోం క్వారంటైన్ వేసిన స్టాంపు పోస్టు చేయగా.. సామాజిక మాధ్యమాల్లోనూ, టీవీల్లోనూ విపరీతంగా కథనాలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చజరిగింది. అయితే కొంతమంది స్నేహితులు, సన్నిహితులు ఏదో అయిపోయిందనుకొని నా ఆరోగ్యంపై ఆరా తీశారు. అందుకే అందరి అపోహలు తొలగించడానికి క్లారిటీ ఇస్తున్నా. నేను షేర్ చేసిన పోస్టు నాది కాదు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఉదాహరణగా ఆ ఫొటో పోస్టు చేశాను. అది నా చేయి కాదు. నేను క్షేమంగానే ఉన్నాను"
-- అమితాబ్ బచ్చన్, సినీ నటుడు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల ఎడమచేతికి హోం క్వారంటైన్ స్టాంప్ వేయాలని నిర్ణయించింది. అనుమానిత వ్యక్తులకు అవగాహన కల్పించేలా హోం క్వారంటైన్ స్టాంప్ కార్యక్రమాన్ని అమితాబ్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసిన ఓ వ్యక్తి చేతి ఫొటోను.. బిగ్‌బీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే అమితాబ్‌కు కరోనా సోకిందని అందుకే ఆ స్టాంపు వేశారని పుకార్లు రావడం చర్చనీయాంశమైంది.
-
T 3473 - Stamping started on hands with voter ink, in Mumbai .. keep safe , be cautious , remain isolated if detected .. pic.twitter.com/t71b5ehZ2H
— Amitabh Bachchan (@SrBachchan) March 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3473 - Stamping started on hands with voter ink, in Mumbai .. keep safe , be cautious , remain isolated if detected .. pic.twitter.com/t71b5ehZ2H
— Amitabh Bachchan (@SrBachchan) March 17, 2020T 3473 - Stamping started on hands with voter ink, in Mumbai .. keep safe , be cautious , remain isolated if detected .. pic.twitter.com/t71b5ehZ2H
— Amitabh Bachchan (@SrBachchan) March 17, 2020