![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
సత్యాగ్రహం ముగిసిన మూడు రోజులకే...
మమత సత్యాగ్రహ దీక్షను ముగించిన మూడు రోజులకే మోదీ పశ్చిమ్ బంగకు వస్తున్నారు. ఈ వారంలో మోదీ రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి.
భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న 23 పార్టీలు తమ భారాన్నంతా మమతపైనే పెట్టారు. 46 గంటలపాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు ఆ పార్టీలన్నీ దీదీకి పూర్తి మద్దతు ప్రకటించాయి.
ఎదురుదాడి ప్రయత్నాల్లో ప్రధాని
పార్టీతో పాటు ప్రధాని పదవికి పోటీగా నిలుస్తున్న మమతకు చెక్ పెట్టేందుకు మోదీ వ్యూహాలు పన్నుతున్నారు. పశ్చిమ్ బంగలో పర్యటనల జోరు పెంచారు. దీదీ చేస్తున్న ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చేందుకు బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా జల్పాయీగుఢీని ఎంచుకున్నారు. ముఖ్యంగా మమత దీక్షపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోనూ...
ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ రాష్ట్రంలో ప్రధాని తొలిసారి పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు రాయ్‌గఢ్ జిల్లాలోని బహిరంగ సభకు మోదీ హాజరవుతారు.