బీజేవైఎం కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. రెండు బృందాలుగా పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ప్రగతిభవన్ సమీపంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో భారీగా పోలీసు బలగాలు మొహరించినప్పటికీ బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా చేరుకున్నారు. విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులందరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
ప్రగతి భవన్ ముట్టడికి బీజేవైఎం శ్రేణుల యత్నం - inter
ఇంటర్ ఫలితాల అక్రమాలు, భాజపా నాయకుల అరెస్ట్లకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
bjym