పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడడం కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైన మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌కు చుక్కెదురైంది. బీసీసీఐ అతడికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. నిరుడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యువీ.. కెనడా టీ20, అబుదాబి టీ10 లీగ్స్‌లో ఆడాడు. రిటైరైన ఆటగాడు కావడం వల్ల బీసీసీఐ అనుమతి లేకుండానే ఆ టోర్నీల్లో ఆడాడు. ఆ కారణంగానే.. మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు బోర్డు అతడికి అనుమతిని నిరాకరించినట్లు తెలిసింది.
2000 ఏడాదిలో దాదా కెప్టెన్సీలో భారత జట్టులోకి వచ్చిన యూవీ సుదీర్ఘకాలం రాణించాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో మధుర విజయాలు అందించాడు. టీమ్‌ఇండియా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడం వల్ల ఆటకు వీడ్కోలు పలికాడు.
ఇదీ చూడండి : నెట్స్‌లో యూవీ సాధన.. సిక్స్‌తో సందడి