ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి డా. రవీందర్రెడ్డి తెలిపారు. లక్కారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో భాగంగా కొత్తగా చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్కారం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధించేందుకు అనుమతిచ్చినట్లు తెలిపారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేయాలని రవీందర్రెడ్డి కోరారు.
ఇవీ చూడండి: పిల్లలు ఆరుగురు... టీచర్లు ఎనమండుగురు!