క్షణాల్లో జరిగిపోయింది
వర్షాకాలం వస్తే...ఏదో ఓ చోట విద్యుదాఘాతంతో రైతు మరణించాడనో..లేక...పశువులు మృతి చెందాయనో వార్తాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పట్టణాల్లో సైతం..ఇదే తంతు జరుగుతోంది. మెున్నటికి మెున్న..తెలంగాణలో ఆడుకుంటూ ఓ పిల్లాడు విద్యుత్ స్తంభం తగిలి మృతి చెందాడు. నిన్న ఓ మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ బురద దాటే సమయంలో సాయం కోసం ఇనుప స్తంభాన్ని పట్టుకుంది. అదే ఆమెకు శాపమైంది. ఆమె అక్కడికక్కడే మరణించింది.
చిన్న జాగ్రత్తతో పెద్ద మేలు...
నిర్లక్ష్యం ఎవరిదైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రోడ్డు మీద నడుస్తున్న సమయంలో వీలైతే ఇనుప స్తంభాలు పట్టుకోకుండా ఉంటే మంచిది. విద్యుత్ స్తంభాలకు దూరంగా నడవాలి. ఆడుకునే పిల్లలపై ఓ దృష్టి పెట్టాలి. పాఠశాలకు వెళ్లేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఆడుకునేటప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలి. వానా కాలంలో విద్యుత్ నిరోధక వస్తువులను వినియోగించేలా ప్రోత్సహించండి. విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున.. గాలివాన సయమంలో బయటకు వెళ్లకపోవడమే మేలు. ఎక్కడైనా తీగలు తెగిపడినా... అలాంటి అవకాశాలు ఉన్నా... విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలి.
ఇదీ చదవండి : వైరల్: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'