ETV Bharat / briefs

ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. అనంతరం గవర్నర్ నరసింహన్​ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు.

author img

By

Published : Mar 23, 2019, 6:40 AM IST

Updated : Mar 23, 2019, 7:22 AM IST

అఖిలపక్ష సమావేశం

పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ నరసింహన్‌కు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ వ్యవహారంపై సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో హస్తం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతల రౌండ్​ టేబుల్ సమావేశం జరగనుంది.

దాదాపు రెండు గంటలపాటు జరగనున్న ఈ భేటీలో రాజకీయ ఫిరాయింపులపై సమీక్షించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెరాస ప్రభుత్వంపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి వీరప్పమెయిలీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు గవర్నర్‌ను కలవనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

all party meet

ఇవీ చూడండి:'మనతో మనకే పోటీ... ఇవ్వాలి గట్టి మెజార్టీ'

Last Updated : Mar 23, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.