ETV Bharat / briefs

ఐదేళ్లలోపు చిన్నారులందరికి ఆధారే లక్ష్యంగా.. - aadhar cards

ఐదేళ్లలోపు చిన్నారులందరికి బయోమెట్రిక్​తో సంబంధం లేకుండా ఆధార్​ కార్డు జారీ చేయాలని భారత విశిష్ట గుర్తింపు సంస్థ నిర్ణయించింది. ఆధార్​ నమోదుకు సంబంధించిన కిట్ల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున నిధులు కేటాయించాలని కోరింది.

ఐదేళ్లలోపు చిన్నారులందరికి ఆధారే లక్ష్యంగా..
author img

By

Published : May 19, 2019, 7:40 AM IST

Updated : May 19, 2019, 7:45 AM IST

ఐదేళ్లలోపు చిన్నారులందరికి ఆధారే లక్ష్యంగా..

ప్రతి ఒక్కరికి ఆధార్​ అన్న నినాదంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ముందుకెళ్తోంది. అయిదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్​తో సంబంధం లేకుండా ఆధార్​ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్​ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు రాష్ట్రాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో కోటి 35 లక్షల మంది పిల్లలకు కార్డులు జారీచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ఆధార్​ సంస్థ భరించనుంది. నమోదుకు అవసరమైన కిట్ల కొనుగోలుకు అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించాలని స్పష్టం చేసింది.

ఒక్కో ఛైల్డ్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్టు అధికారి పరిధిలో మూడు కిట్లు కొనుగోలు చేసేందుకు రూ.25 కోట్లకు పైగా నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. తెలంగాణ రూ. 4.02 కోట్లు, ఆంధ్రప్రదేశ్​ రూ. 6.93 కోట్లు, ఒడిశా రూ. 9.12 కోట్లు, చత్తీస్​ఘడ్​ రూ. 5.94 కోట్లను కేటాయించాయి. అండమాన్​ నికోబార్​ నుంచి మాత్రం సరైన స్పందన లేదని ఆధార్​ అధికారులు తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వారి తల్లిదండ్రులు ఆధార్​ కార్డుల ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేస్తామని అధికారులు తెలిపారు.

ప్రతి ఆధార్​ కార్డుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు విశిష్ట గుర్తింపు సంస్థ రూ.17 చెల్లించనుంది. అయిదేళ్లలోపు పిల్లలు తెలంగాణలో 28.8 లక్షల మంది ఉండగా ఇప్పటి వరకు 39 శాతం, ఆంధ్రప్రదేశ్​లో 37.7 లక్షలకు 42 శాతం, చత్తీస్​ఘడ్​లో 28 లక్షల మందికి 37 శాతం, ఒడిశాలో 39.5 లక్షల మంది ఉండగా 42 శాతం పిల్లలకు ఆధార్​ జారీ చేశామని అధికారులు తెలిపారు. అండమాన్​ నికోబార్​ దీవుల్లో 25 వేల మంది ఉండగా 58 శాతం జారీ పూర్తైంది.

ఇవీ చూడండి: రామగుండం ఎన్టీపీసీ పనులు పరిశీలించిన కేసీఆర్

sample description
Last Updated : May 19, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.