కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళారైతు ప్రభుత్వాధికారిపై చెప్పుతో దాడి చేసింది. కిష్టాపూర్‌కు చెందిన రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్యలు పట్టించుకోవట్లేదనే ఆగ్రహంతో అధికారులను నిలదీశారు. కిష్టాపూర్ వీఆర్వో దానయ్యకు ఓ మహిళా రైతు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విసిగిస్తున్నాడు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న మహిళారైతు... కార్యాలయంలో అందరు చూస్తూండగానే దానయ్యపై చెప్పుతో దాడికి దిగింది. అతి కష్టం మీద దానయ్య తప్పించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని మొత్తం మిగతా అధికారులు చూస్తూ ఉండిపోయారు.
ఇవీ చూడండి: మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం