తనకు న్యాయం చేయాలంటూ కరీంనగర్ అంబేడ్కర్ విగ్రహం ముందు గుర్రాల రవీందర్ నిరసనకు దిగాడు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును కపిల్ చిట్ ఫండ్స్‌లో చిట్టివేశాడు రవీందర్. చిట్టి అయిపోయాక పోగుచేసుకున్న సొమ్మును ఇమ్మని అడిగితే ఇవ్వకపోగా... ఇంకా కట్టాలని ఇంటిపై దాడి చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయినా ఫలితం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రవీందర్‌కు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల