తమ బంధువు పెద్దకర్మ సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమానికి అనేక మంది హాజరయ్యారు. నాటుసారా సేవించి, వెంటనే అస్వస్థత పాలయ్యారు. 16 మంది బాలూపూర్ గ్రామంలోనే మృతి చెందారు. కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో మరో 18మంది చనిపోయారు.
షహరాన్‌పూర్‌లో చనిపోయిన 18మంది మృతుల్లో తొమ్మిది మంది మాత్రమే బలూపూర్లో నాటుసారా సేవించారని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని బాలూపూర్‌లో నాటు సారా విక్రయించిన వ్యక్తే ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో అమ్మినట్టు అధికారులు భావిస్తున్నారు.
27మందిపై వేటు
ఘటనపై విచారణకు ఆదేశించాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. సిబ్బంది, పోలీసులు మొత్తం 17 మందిని సస్పెండ్ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. 10 మంది పోలీసులను విధుల నుంచి తప్పించింది యూపీ సర్కారు.