శంషాబాద్ విమానాశ్రయంలో సోదాల్లో మరోసారి పెద్ద ఎత్తున బంగారం బయటపడింది. ముందస్తు సమాచారంతో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 11.1 కిలోల పుత్తడిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.3,63,52,500 అంచనా వేస్తున్నారు. వీటితో పాటు 4లక్షల 25వేల విలువైన సింగపూర్ డాలర్లు, యూఏఈ దీరమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మహిళ గత మూడు నెలలుగా నివాసం ఉంటున్న ఓ ఐదు నక్షత్రాల హోటల్ గదిలో అధికారులు సోదాలు చేశారు. రూ. 1,50,64,012 విలువైన అమెరికా డాలర్లు, సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్లో బంగారం ఎవరిచ్చారు.. హైదరాబాద్లో ఎవరికి ఇవ్వమన్నారు.. గతంలో బంగారం ఎంత మేర అక్రమ రవాణా చేసిందనే కోణంలో ఆరా తీస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.
ఇవీ చూడండి: సైబర్ నేరాల దర్యాప్తులో నిర్లక్ష్యం... బాధితులకేదీ న్యాయం