ETV Bharat / crime

LIVE VIDEO : రాజన్న సిరిసిల్ల జిల్లాలో తండ్రి ఎదుటే యువతి కిడ్నాప్ - Young Woman Kidnap in Sircilla

Young Woman Kidnap in Karimnagar
Young Woman Kidnap in KarimnagarYoung Woman Kidnap in Karimnagar
author img

By

Published : Dec 20, 2022, 10:24 AM IST

Updated : Dec 20, 2022, 1:16 PM IST

08:53 December 20

Young Woman Kidnap in Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్​

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తండ్రి ఎదుటే యువతి కిడ్నాప్

Young Woman Kidnap in Sircilla: రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తెల్లవారుజామున కారులో వచ్చిన కొందరు వ్యక్తులు.. తండ్రిని తోసేసి యువతిని తీసుకెళ్లారు. మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలిని ఇంటి వద్దకు తెల్లవారుజామున ​కారులో ముఖాలకు మాస్కులు వేసుకుని కొందరు వ్యక్తులు వచ్చారు. బయటికి వచ్చిన శాలినిని పట్టుకుని కారులో ఎక్కిస్తుండగా.. గమనించిన ఆమె తండ్రి అడ్డుకోబోయాడు. తండ్రిని తోసేసి శాలినిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్‌పై యువతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది క్రితం జాన్‌-శాలిని పారిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మైనర్‌ అయిన తమ అమ్మాయిని జాన్‌ కిడ్నాప్‌ చేశాడని అప్పట్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని తీసుకువచ్చి.... విడిపించగా ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల శాలినికి మైనార్టీ తీరటంతో నిశ్చితార్థం చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యువతిని అపహరించటంతో జాన్‌పైనే కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచి తీసుకువెళ్తుండగా అక్కడి సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలు, కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

"ఈరోజు ఉదయం మా అమ్మాయి నేను కలిసి హనుమాన్​ గుడికి వెళ్లి వస్తుండగా జాన్​ అనే వ్యక్తి అతని మరో ముగ్గుర స్నేహితులు కారులో వచ్చి మా అమ్మాయిని తీసుకుపోయారు. అడ్డుకోబోయిన నన్ను కొట్టి మా అమ్మాయిని తీసుకుపోయాడు. పోలీసులు ఎలైనా మా బిడ్డను మా దగ్గరకు చేర్చాలని వేడుకుంటున్నాం." -చంద్రయ్య, యువతి తండ్రి

"ఈరోజు ఉదయం 5.20 నిమిషాలకు చందుర్తిలో శాలిని అనే అమ్మాయిని గుర్తు తేలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. కారు నెంబర్​, సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా వారిని పట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం."- రమేశ్‌, చందుర్తి ఎస్సై

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.