ETV Bharat / crime

woman attacked in Erragadda: మహిళపై కత్తితో దాడి... వివాహేతర సంబంధమే కారణం! - ఎర్రగడ్డలో మహిళపై దాడి

woman attacked by a man
woman attacked by a man
author img

By

Published : Jan 11, 2022, 6:01 PM IST

Updated : Jan 11, 2022, 7:10 PM IST

17:58 January 11

woman attacked in Erragadda: మహిళపై కత్తితో దాడి... వివాహేతర సంబంధమే కారణం!

woman attacked in Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డలోని శంకర్‌నగర్‌లో మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డు మీద మహిళపై కత్తి దాడి చూసి స్థానికులు భీతిల్లారు. స్థానికుల సమాచారంతో మహిళపై దాడికి పాల్పడిన ఖలీల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. బి శంకర్‌లాల్‌ నగర్‌లో 35 సంవత్సరాల ఓ మహిళ నివాసం ఉంటోంది. మొదటి భర్తను విడిచి పెట్టి కర్ణాటకకు చెందిన శ్రీశైలంను రెండో వివాహం చేసుకుంది. అదే ప్రాంతంలో ఉంటున్న ఖలీల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే కొద్దిరోజులుగా ఖలీల్​తో బాధిత మహిళ మాట్లాడకుండా దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఖలీల్‌.. గౌతమ్‌పూరి కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.

స్థానికుల సమాచారంతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. బాధిత మహిళకు ఇద్దరు పిల్లలున్నారని స్థానికులు చెప్పారు.

ఇదీచూడండి: Vijayawada Rape news : గంజాయి మత్తు.. మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి

Last Updated : Jan 11, 2022, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.