Bus Accident: మెదక్ జిల్లా హవేళిఘనపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో తల్లీకుమార్తె మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ వాసులు అజ్మీర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘటనాస్థలికి మెదక్ డీఎస్పీ సైదులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొందరు క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్ల వెనుక టైర్ పగిలిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్లు డీఎస్పీ సైదులు వెల్లడించారు. ఆ బస్సులో 50 మంది వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారిలో అజీజ (45 ), జాయెద(16) మరణించారని వెల్లడించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: