ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్​ పిటిషన్​పై రేపు ఉదయం విచారిస్తామన్న హైకోర్టు

author img

By

Published : Dec 7, 2022, 11:47 AM IST

Updated : Dec 7, 2022, 3:38 PM IST

High Court
High Court

11:43 December 07

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మెమో తిరస్కరణపై రేపు ఉదయం విచారిస్తామన్న హైకోర్టు

MLAs Poaching Case Latest Update : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమో తిరస్కరించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టులో దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. అ.ని.శా. కోర్టు పరిధి దాటి వ్యవహరించిందని ఏజీ వాదించారు. మెమో రిజెక్ట్ చేసే అధికారం అ.నిశా. కోర్టుకు ఉన్నా క్వాష్ పిటిషన్ ఆర్డర్ లా ఉందని తెలిపారు. అ.ని.శా. కోర్టు ఆర్డర్‌ను ప్రతిపాదిత నిందితుల తరపు న్యాయవాది సమర్థించారు. ప్రతిపాదిత నిందితుల తరఫువారికి హైకోర్టు నోటీసులు జారీ చేయాలని సూచించింది. ఈ అంశాన్ని ఉన్నత న్యాయస్థానం రేపు ఉదయం విచారిస్తామని తెలిపింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోశ్​, డా.జగ్గుస్వామి, తుషార్‌ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను మంగళవారం ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సిట్ ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ వ్యాజ్యం వేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. బీఎల్ సంతోశ్‌, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ.. గత నెల 22న మొయినాబాద్ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. తుషార్, జగ్గుస్వామిలను అరెస్ట్ చేయడానికి.. వారెంట్‌ను కూడా దాఖలు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోశ్‌, రామచంద్ర భారతి వాట్సప్ సంభాషణలు జరిపారని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే దురుద్దేశంతో కుట్ర పన్నారని పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు.

మరోవైపు ఇదే కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలని శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్దించారు. ఈ కేసును ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్దికోసమే ఉపయోగించుకుంటోందని శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్‌ హుల్లా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పజెప్పాలన్న దానిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. సిట్ దాఖలు చేసిన కౌంటర్ వివరాలు లీక్‌ అవడంపై కూడా హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది.

రహస్యంగా ఉంచాలనుకున్న సిట్ నివేదిక ఎలా బయటకు వచ్చిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించగా.... సిట్ కౌంటర్ కాపీలను పిటిషనర్లు, వారి తరఫు న్యాయవాదులకు అందించామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. పిటిషనర్లు ఓ రాజకీయ పార్టీకి అందించారని వారి ద్వారా మీడియాకు లీక్ అయిందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఓ కాపి ఇచ్చామని ఆయన ద్వారా సీఎంకు చేరి ఉండొచ్చని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కౌంటర్ కాపీ సిట్ ద్వారా బయటకు రాలేదని అదే రోజు ప్రకటనను సీపీ ఆనంద్ విడుదల చేశారని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనల అనంతరం హైకోర్టు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

జైలు నుంచి సింహయాజీ విడుదల.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామిజీకి నిన్న బెయిల్​ పత్రాలు జారీ కావడంతో ఇవాళ చంచల్​గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇద్దరు జామీను, రూ. 6 లక్షల పూచీకత్తుతో ఆయన విడుదల అయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాంచంద్ర భారతి, నందకుమార్​లకు బెయిల్​ మంజూరు అయినప్పటికీ వారిపై బంజారాహిల్స్​ పీఎస్​లో కేసులు ఉండటంతో వారు చంచల్​ గూడ జైల్లోనే ఉన్నారు. రామచంద్రభారతి, నందకుమార్ ష్యూరిటీలను కోర్టు ఇవాళ పరిశీలించనుంది. ష్యూరిటీలను ఆమోదించిన తర్వాత బెయిల్ ఆర్డర్స్ జైలుకు చేరనున్నాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు రిలీజ్ అవుతారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 7, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.