Polycet 2022: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది. ఏప్రిల్ రెండో వారం నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు.
వంద రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పాలిటెక్నిక్, వ్యవసాయ, పశుసంవర్ధక, హార్టికల్చర్ యూనివర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ సీట్లను కూడా పాలిసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారని సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: