ETV Bharat / crime

తండ్రిని చంపిన బాలిక.. ఆ కోపంతోనే హత్య!

daughter killed father
daughter killed father
author img

By

Published : Apr 29, 2022, 9:44 AM IST

Updated : Apr 29, 2022, 12:39 PM IST

09:40 April 29

Daughter Killed Father : తండ్రిని హత్య చేసిన కుమార్తె

Daughter Killed Father : ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని సంబురపడ్డాడు ఆ తండ్రి. అడుగు కింద పెట్టకుండా గుండెలో పెట్టుకుని పెంచాడు. స్తోమతకు మించిందైనా అడిగిన ప్రతీది చేశాడు. తన గారాలపట్టికి ఏ కష్టం రాకూడదని.. ఆహర్నిశలు శ్రమించాడు. ఆమె కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి చదివించాడు. ఏడాది క్రితం తల్లిని కోల్పోవడంతో కూతుర్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తల్లిలేని పిల్ల అని ఇంకా గారాబం చేశాడు. ఇంత ప్రేమగా.. ప్రాణం పెట్టి చూసుకుంటున్న ఆ తండ్రి ప్రేమ.. తన జీవితంలోకి ఓ యువకుడు రాగానే తనకి తక్కువగా అనిపించింది. నెమ్మదిగా.. అతడిపై ఉన్న ఇష్టం.. ఆమెను తండ్రి నుంచి దూరం చేసింది. ఈ క్రమంలో తండ్రికి ఆమె ప్రేమ విషయం తెలిసి.. ఇప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లవే బిడ్డా.. అమ్మ కూడా లేదు నీకు సర్దిచెప్పడానికి.. ఇంకో రెండేళ్లు ఆగు తల్లీ.. పెళ్లంటే చాలా పెద్ద బాధ్యత.. నువ్వు ఇప్పుడు ఆ బాధ్యత మోయలేవు.. రెండు మూడేళ్లు ఆగితే.. ఆ పిల్లాడికే ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను.. అంత వరకు ఆగమ్మా అని ఎంతో నచ్చజెప్పాడు. ఆ తండ్రి ఆవేదన ఆమెకు కోపం కలిగించింది. ఓ వైపు ప్రియుడితో పెళ్లికి అంగీకరించకపోవడం.. మరోవైపు ఆస్తి తగాదాలు.. ఇలా ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు కన్నకూతురే తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తండ్రిని హతమార్చే వరకు దారి తీసింది.

ఆస్తి కాగితాల కోసం కన్నతండ్రినే..... కూతురు కొట్టి చంపిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా వేమునూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. కుటుంబ కలహాలతో ఆయన భార్య ఐలమ్మ 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి ఓ వ్యక్తితో వెంకన్న కుమార్తె ప్రేమలో పడింది. కొద్ది రోజుల క్రితం కులపెద్దల వద్ద పంచాయతీ జరగ్గా.. మేజర్‌ అయిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు.

అప్పటివరకు వెంకన్నకి చెందిన ఆస్తి కాగితాల్ని బంధువుల వద్ద ఉంచారు. ఆ తర్వాత తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుంతుడటంతో..... కుల పెద్దల వద్ద ఉంచారు. మరోసారి ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకోగా తండ్రిపై... కూతురు దాడి చేయగా వెంకన్న అక్కడకక్కడే చనిపోయాడు. ఆ విషయాన్ని కూతురు, గ్రామపెద్దలు.. రహస్యంగా ఉంచారు. కొందరు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. హత్యలో కూతురు కాకుండా ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 29, 2022, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.