ETV Bharat / city

నాగార్జునసాగర్‌లో కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన

KRMB sub committee will visit nagarjuna sagar

author img

By

Published : Nov 11, 2021, 6:45 PM IST

Updated : Nov 11, 2021, 8:02 PM IST

18:42 November 11

నాగార్జునసాగర్‌లో కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం 15, 16 తేదీల్లో నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. కేంద్ర జల్​శక్తి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా కేఆర్ఎంబీకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన అవుట్​లెట్లను సబ్​కమిటీ పరిశీలించనుంది.  

గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్​లెట్లను పరిశీలించిన ఉపసంఘం.. తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని సబ్​కమిటీ నాగార్జున సాగర్​లో పర్యటించనుంది.  

ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పంప్​హౌస్​, సాగర్​ స్పిల్​వే, స్లూయిస్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్​ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ హెడ్​రెగ్యులేటర్లను ఉపసంఘం పరిశీలించనుంది. రెండో రోజైన 16వ తేదీన సాగర్ ఎడమకాల్వ పవర్ హౌస్, ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్​రెగ్యులేటర్ పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఉపసంఘం సమావేశం నాగార్జునసాగర్​లో జరగనుంది. 

ఇదీచూడండి: Heavy Rains : బీ అలర్ట్.. భారీ వర్షాలు.. చలిగాలులు... ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Last Updated : Nov 11, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.