ETV Bharat / sitara

Sonu Sood: సోనూసూద్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు - sonusood latest news

IT Raids on actor Sonu Sood office and house
సోనూసూద్
author img

By

Published : Sep 15, 2021, 5:08 PM IST

Updated : Sep 15, 2021, 6:01 PM IST

17:04 September 15

ఆరుచోట్ల ఆదాయపన్నుశాఖ సోదాలు

ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఈ మేరకు ముంబయి, లఖ్‌నవూలోని సోనూసూద్‌కు చెందిన ఆరు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  

అయితే సోనూసూద్‌ నివాసంలో తనిఖీలు జరిగాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో ఎంతో మంది వలసకార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు సోనూ సాయం చేశారు.  

అటు దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న 'దేశ్‌కే మెంటార్స్' కార్యక్రమానికి సోనూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకే సోదాలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Last Updated : Sep 15, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.