inter first year exams : తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయోచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు. పరీక్షల్లో సిలబస్ 70శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్ పెంచామని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ ఏడాది 11 శాతం తగ్గింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు గురువారం వెల్లడించింది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్, ఒకేషనల్... రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం సమానంగా రావడం గమనార్హం.
ఇదీ చూడండి: TS Intermediate Pass Percentage 2021 : ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 49 శాతమే పాసయ్యారు