ETV Bharat / sports

అదితి అద్భుత ప్రదర్శన.. కానీ! - అదితి అశోక్​

aditi
అదితి
author img

By

Published : Aug 7, 2021, 10:24 AM IST

Updated : Aug 7, 2021, 11:36 AM IST

10:22 August 07

అదితి సూపర్​ షో

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తృటిలో పతకం చేజారింది. గోల్ఫ్​ వ్యక్తిగత స్ట్రోక్​ ప్లేలో 4వ స్థానంలో నిలిచింది గోల్ఫర్​ అదితి అశోక్​. ఈ విభాగంలో.. అమెరికా గోల్ఫర్ నెల్లీ కొర్డా స్వర్ణం సాధించింది.

ఒలింపిక్స్​లో 4వ స్థానంలో నిలవడంపై సంతోషంగా లేనని అదితి తెలిపింది.

"ఈ ఈవెంట్​లో 4వ స్థానంలో నిలిచాను. వేరే ఎక్కడైనా 4వ స్థానంతో ఆనందిస్తాను. కానీ ఇది ఒలింపిక్స్​. 4వ స్థానంతో ఆనందంగా ఉండటం కష్టం. నేను బాగా ఆడాను. నా 100శాతం ఇచ్చాను. పతకం వచ్చి ఉంటే ఆనందంగా ఉండేది. కానీ నా ప్రదర్శనతో అందరు సంతోషంగా ఉంటారని భావిస్తున్నా. గోల్ఫ్​పై ప్రజలకు ఆసక్తి కలుగుతుందని ఆశిస్తున్నా."

  -- అదితి అశోక్​, భారత గోల్ఫర్​.

పతకం దక్కకపోయినా.. తన అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల చూపును అకట్టుకుంది అదితి. 23ఏళ్ల అదితికి.. 2020లో అర్జున అవార్డు వరించింది. ఇక ఒలింపిక్స్​లో అదితి ప్రదర్శనతో భారత్​లో గోల్ఫ్​కు ఆదరణ పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదితిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అద్భుత ప్రదర్శన అదితి అశోక్​! మరో భారత ఆడబిడ్డ తన ముద్ర వేసింది. ఈ రోజు నీ చారిత్రక ప్రదర్శనతో భారత గోల్ఫ్​ని కొత్త స్థాయికి తీసుకెళ్లావు. చాలా ప్రశాంతంగా, నిలకడగా ఆడావు. నీ నైపుణ్యం, శ్రమకు అభినందనలు.

                          --- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి.

అదితి.. అద్భుత ప్రదర్శన! టోక్యో ఒలింపిక్స్​లో విశేష ప్రతిభను చూపించాను. పతకం తృటిలో చేజారినప్పటికీ, ఏ భారతీయుడు సాధించని ఘనత సాధించావు. నీ భవిష్యత్తు కార్యచరణకు శుభాకాంక్షలు.

              --- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి:- 'అదితి వల్ల ఇండియా గోల్ఫ్​ నేర్చుకుంటుంది'

Last Updated : Aug 7, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.