ETV Bharat / international

మురుగు కాలువలో పేలుడు- 16 మంది మృతి - గ్యాస్ పేలుడు

explosion in pakistan karachi
భవనంలో బాంబు పేలుడు
author img

By

Published : Dec 18, 2021, 3:48 PM IST

Updated : Dec 18, 2021, 10:56 PM IST

15:42 December 18

మురుగు కాలువలో గ్యాస్​ పేలుడు- 16 మంది మృతి

మురుగు కాలువలో గ్యాస్​ పేలుడు

Pakistan karachi Explosion: మురుగు కాలువలో పేరుకుపోయిన ఓ శక్తిమంతమైన గ్యాస్​ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు. మరో 15 మందికిపైగా గాయాలయ్యాయి. పాకిస్థాన్​లోని కరాచీలో ఈ ఘటన జరిగింది.

"కరాచీ షేర్షా పరిసరాల్లోని ఓ బ్యాంకు భవనం కింద మురుగు కాలువలో గ్యాస్​ కారణంగా ఈ పేలుడు సంభవించింది. గ్యాస్ పేలేందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటో తెలియరాలేదు. దీనిపై ఓ నిపుణుల బృందం దర్యాప్తు చేపట్టింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. సమీపంలో పార్క్​ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి" అని పోలీసు అధికార ప్రతినిధి సోహైల్ జోఖియో తెలిపారు.

ఈ పేలుడు కారణంగా 16 మంది మరణించారని కరాచీలోని ట్రామా సెంటర్​కు చెందిన వైద్యుడు​ సబీర్​ మీమోన్​ తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చాలా మంది అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

Last Updated : Dec 18, 2021, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.