ETV Bharat / state

మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం - తెరాస కాంగ్రెస్​ కొట్లాట

nalgonda godava
nalgonda godava
author img

By

Published : Jul 26, 2021, 4:25 PM IST

Updated : Jul 26, 2021, 8:01 PM IST

16:21 July 26

రేషన్​కార్డుల పంపిణీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

ప్రొటోకాల్, అభివృద్ధి పనుల విషయంలో అధికార పార్టీ నేతలపై గరం గరంగా ఉన్న నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి... కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేళ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఏడేళ్లలో నల్గొండ జిల్లా అభివృద్ధికి ఏం చేశారంటూ మంత్రి జగదీశ్ రెడ్డిని నిలదీయడమే కాకుండా చేతిలోని మైకుని లాక్కునే ప్రయత్నం చేశారు. అప్పటికే పెద్దఎత్తున మోహరించిన ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించాయి. రెండు వర్గాల గొడవతో... కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చౌటుప్పల్‌లో  రసాభాసగా మారింది.  

కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదు

  ప్రతిపక్ష శాసనసభ్యుడు కావడం వల్లే చిన్నచూపు చూస్తూ కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని... మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా లక్కారంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత పాలకులు వైఫల్యాలను ప్రస్తావిస్తూనే తెరాస చేసిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు అంటూ ఎమ్మెల్యే అడ్డుకునే  క్రమంలో ఇరువురు నేతల మాటామాటా పెరిగింది. ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని నిరసన తెలిపిన రాజగోపాల్‌ రెడ్డి... ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. కాంగ్రెస్, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోగా పోలీసులు వారిని వారించారు.  

హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారిపై బైఠాయించి నిరసన

కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి... కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా అభివృద్ధిని ఏనాడు కాంక్షించని మంత్రి రాజకీయాలు చేస్తున్నారంటూ  మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం, మంత్రి జగదీశ్‌ రెడ్డి లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సునిశిత విమర్శలు చేశారు. ఉత్తర తెలంగాణకు వేల కోట్ల నిధులు కుమ్మరిస్తున్న సర్కార్‌... నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. బ్రాహ్మణవెల్లంల, ఎస్​ఎల్​బీసీ, డిండి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన కోమటిరెడ్డి... మంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు జగదీశ్‌ రెడ్డికి లేదంటూ విమర్శించారు.  

'మొట్టమొదటిసారి రేషన్​కార్డులు ఇచ్చేందుకు వచ్చిన మంత్రి... కనీసం స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించలేదు. సమస్యల మీద మాట్లాడని జిల్లా మంత్రి, స్పందించని మనిషి... ఏదైనా అఫీషియల్​ ప్రోగ్రాం ఉంటే మాత్రం ఓడిపోయిన ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని వస్తుంటారు. ఈటల రాజేందర్​ను ఓడించేందుకు దళితబంధు పథకం తెచ్చారు. మునుగోడులో దళితులు లేరా...? అదే నేను జగదీశ్​రెడ్డి స్థానంలో ఉంటే రాజీనామా చేసేవాడిని. 

-కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

 చిల్లర రాజకీయాల వల్ల ప్రజల్లో మరింత చులకన 

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి విమర్శలను మంత్రి జగదీశ్‌ రెడ్డి తిప్పికొట్టారు. ప్రతిపక్ష సభ్యులు ఉనికి కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. చిల్లర రాజకీయాల వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారంటూ మంత్రి చురకలు అంటించారు.  

'రాజకీయ పార్టీల వల్ల మనుగడ కోల్పోతున్నామన్న బాధతో చిల్లరవేషాలు వేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుని ప్రభుత్వాన్ని బదనాం చేసి వాళ్లేదో పైకొస్తామన్న తెలివితక్కువ ఆలోచన, మీడియాలో ఉండాలన్న ఆలోచన తప్ప... ప్రజలకోసం పనిచేయాలని లేదు. 

- జగదీశ్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి

 తాజా పరిణామాలతో నల్గొండలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరస్పర విమర్శలతో ఇరువురు నేతలు తమ నోటికి పనిచెప్పారు.  

ఇదీ చూడండి: Minister KTR: 'అర్హులందరికీ రేషన్​ కార్డులు.. పేదల సంక్షేమమే లక్ష్యం'

Last Updated : Jul 26, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.