రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 1,811 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది. వైరస్ కారణంగా 13 మంది మృత్యువాత పడగా... ఇప్పటివరకు 505 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 15,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొవిడ్ బారి నుంచి 44,572 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా 18,263 పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు 4,16,202 టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీలో అత్యధికంగా మరో 521 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ అర్బన్‌లో తరువాత స్థానంలో ఉన్నాయి.