ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న టోల్గేట్ రేకులు ఎగిరి మీద పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లాలో మిడ్జిల్ మండలం మున్ననూర్ వద్ద కొత్తగా టోల్గేట్ నిర్మాణం చేపడుతున్నారు. రహదారి పక్కనే మున్ననూరు కు చెందిన దంపతులు కృష్ణయ్య, పుష్ప వరి ధాన్యం ఆరబోశారు. వర్షం కురుస్తున్నందున ధాన్యాన్ని కుప్పగా చేద్దామని అక్కడకు వెళ్లారు. అదే సమయంలో వీచిన భారీ గాలులకు రేకులు లేచి వారి మీద పడ్డాయి. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇవీ చూడండి: బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు