ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. కొత్తగా 38 వేల 898 మందికి పరీక్షలు నిర్వహించగా... 837 మందికి వైరస్ నిర్థరణ అయినట్లు తేలింది. వీరిలో 789 మంది స్థానికులు కాగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 46 మంది, ఇతరదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది.
ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 16వేల 934కు ఎగబాకింది . కొత్తగా కర్నూలు జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో చెరొకరు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 206కు పెరిగింది. ప్రస్తుతం 9వేల 96 మంది చికిత్స పొందుతుండగా 7వేల 632 మంది డిశ్చార్జి అయ్యారు.